NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అపూర్వ స్నేహితుల ఆత్మీయ కలయిక..

1 min read

– హైకోర్టు యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తిగా ఆకుల నియమకం హర్షనీయం..బి వి కృష్ణారెడ్డి

పల్లెవెలుగు వెబ్​ ఏలూరు  :  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆకుల వెంకట శేష సాయి నియమితులు కావడం పట్ల  హైకోర్టు న్యాయవాది మరియు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బి.వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేష సాయి  1987 సర్ సి ఆర్ ఆర్ న్యాయ కళాశాల బ్యాచ్ లో ఇద్దరు కలిసి చదువుకున్నామని అని అన్నారు. ఆయన సౌమ్యుడు, మేధావి అని, ఇప్పటివరకు న్యాయవాదులు, కక్షి దారులు అందరి మన్ననలు పొందిన న్యాయమూర్తి అని BBB no. no noకొనియాడారు. త్వరలో అత్యున్నత న్యాయస్థానాన్ని అధిరోహించాలని ఏలూరు సర్ సి ఆర్ ఆర్ న్యాయ కళాశాల బ్యాచ్ తరపున ఆకాంక్షిస్తున్నామని తెలిపారు.

About Author