PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంటరానితనం… కులవివక్ష అనుభవించిన కులాలే ఎస్ సి లు

1 min read

బిసి లు అయిన కురుబలను

మదాసి మదారి కురువలుగా గుర్తించొద్దు

కులగణనలో కురుబలను ఎస్ సి లో నమోదు చేయవద్దు

సబ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ కు వినతి పత్రం అందజేసిన దళిత సంఘాల నాయకులు

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల గణనలో బీసీ జాబితాలో బిసి బి కేటగిరి లో  సీరియల్ నంబర్ 11 లో ఉన్నటువంటి కురుబ కురుమ కులాలను మదాసి మదారి కురువలు నమోదు చేయవద్దు అని ఎమ్మార్పీఎస్, మాల మహానాడు దళిత నాయకులు ఆదోని సబ్ కలెక్టర్ శివ నారాయణ శర్మను కోరారు. ఎటువంటి వివక్షకు గురికాని కురుబ కులస్తులు ఎస్పీలు కాదని పేర్కొంటూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ స్థిర నివాసం లేక సంచార జీవనం కలిగి గొర్రెలు మేపడమే జీవనంగా కొండ ప్రాంతాలలో, ఊరి బయట పొలాలలో డేరాలు వేసుకుని జీవనం చేస్తున్నటువంటి కులం మదాసి మదారి కురువ కులం అని అటువంటి వృత్తిని కలిగి సమాజానికి బయట దూరంగా జీవిస్తున్నటువంటి వారు ఈ ప్రాంతంలో ఎవరూ లేరని కాబట్టి మదాసి మదారి కురువ కులం ధ్రువీకరణ పత్రాలు ఇతరులు ఎవరికి మంజూరు చేయవద్దని ఈ సందర్భంగా వారు సబ్ కలెక్టర్ ను కోరారు. ఆదోని సబ్ డివిజన్ ప్రాంతంలోని బీసీ కేటగిరీకి చెందిన కురుబ కులస్తులు తామే మదాసి మదారి కురువ కులం అని చెప్పుకుంటూ ఎస్సీ ధృవీకరణ పత్రాలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని, ప్రస్తుతం జరుగుతున్న కుల గణన లో తమ కురుబ కులాన్ని ఎస్సీ కేటగిరీలోని మదాసి మదారి కురువ కులంగా నమోదు చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. షెడ్యూల్డు కులం అంటే రాజ్యాంగం ప్రకారం అంటరానితనం,  కుల వివక్ష,  అనుచివేతకు గురైన వారు అని ఇటువంటి కులాల ప్రజలు  మాత్రమే ఎస్సీలుగా గుర్తించబడతారని పేర్కొన్నారు. సమాజంలో బీసీలుగా రాజకీయ సామాజిక ఆర్థిక బలవంతులుగా ఉన్నటువంటి కురుబ కులస్తులు ఎక్కడ కూడా కుల వివక్షకు గురైన దాఖలాలు లేవని వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న కుల గణనలో సర్వే చేస్తున్న వాలంటీర్లు, సర్వేన పర్యవేక్షిస్తున్న సచివాలయ సిబ్బందికి ఈ విషయంపై సూచనలు ఇచ్చి మదాసి మదారి కురువ కుల నమోదు కోసం అవసరం అయిన రుజువులు పత్రాలను తీసుకున్న తర్వాతే మాదాసి మదారి కురువ కుల నమోదును చేసే విధంగా  ఆదేశాలు ఇవ్వాలని సబ్ కలెక్టర్  విన్నదించారు. అంతకు మునుపు ఆలూరు పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో జరిగిన దళిత కులాల ఐక్యవేదిక సమావేశంలో బీసీలు అయిన కురుబలు మదాసి కురువ మదారి కురువ లుగా ధ్రువీకరణ పత్రాలు పొందితే అసలైన మదాసి కురువలకు హజారి కురువలకు జరిగే నష్టంపై అలాగే దళిత కులాలపై చూపే ప్రభావం పై చర్చించారు. ఈ సమావేశంలో ఈ విషయంపై భవిష్యత్ కార్యాచరణను రూపొందించేలా దళితుల ఐక్యతను పెంపొందించేలా చర్చించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దళిత నాయకులు చిన్న హట శేషగిరి, ఆలూరు సర్పంచ్ తండ్రి మారప్ప,చిదానంద, అడ్వకెట్ జనార్దన్, కన్నారావు, దేవనకొండ మాజీ సర్పంచ్ ఉచిరప్ప, ఆస్పరి మాజీ ఎం పి పి వెంకటేశ్వర్లు, మాజీ ఆలూరు ఎం పి టి సి నర్సప్ప, హెబ్బటం మల్లికార్జున, హత్తిబెళగల్, ముద్దనగేరి సర్పంచ్ గోపి,  వీరేష్ , ఎం ఆర్ పి ఎస్ నాయకులు కత్తి రామాంజనేయులు, వెంకటేష్ మాదిగ, గూల్యం ఎల్లప్ప మాదిగ మహేష్ మాదిగ, బీఎస్పీ నాయకులు, మాల మహానాడు నాయకులు మహానంది, వన్నూరప్ప, వీరభద్ర,  బహుజన టైమ్స్ ఎండి దుర్గాప్రసాద్  బాపురం వీరేష్  ఎమ్మార్పీఎస్ నాయకులు మాల మహానాడు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author