PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఉపాధి’ పని దినాలు పెంచాలి : కలెక్టర్​ జి.సృజన

1 min read

ప్రాధాన్యతా భవనాల పనులలో వేగం పెరగాలి

  • డ్వామా,పంచాయతీరాజ్​ అధికారులను ఆదేశించిన కలెక్టర్​

 పల్లెవెలుగు, కర్నూలు: ఉపాధి హామీ పని దినాలను మరింతగా పెంచాలని  జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో డ్వామా, పంచాయతీ రాజ్ అధికారులతో పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల శాతాన్ని గణనీయంగా పెంచాలన్నారు.  తక్కువ శాతం నమోదు చేసిన ఎమ్మిగనూరు, వెల్దుర్తి ఏపిడిలను కలెక్టర్ వివరణ కోరారు.. సాంకేతిక సమస్య వల్ల హాజరు నమోదు చెయ్యలేక పోతున్నామని వారు వివరించారు… ఆధార్ అనుసంధానం కు సంబంధించి పెండింగ్ ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. మినీ గోకులం పనులకు సంబంధించి పెండింగ్ ఉన్న చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. చెత్త సంపద తయారీ కేంద్రాలకు సంబంధించి నిర్మాణాలను పూర్తి చేసేలా చూడాలన్నారు. వాటర్ షేడ్స్ నిర్మాణాలకు సంబంధించి ఈ నెలలో నిర్దేశించిన మేరకు లక్ష్యాలను సాధించాలన్నారు. అదే విధంగా ఉపాధి హామీ పనులకు సంబంధించి ఏమైనా నగదు రికవరీలు ఉంటే సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని ఆగస్టు 15వ తేదీలోపు పూర్తి చేయాలని జిల్లా విజిలెన్స్ అధికారి సిద్దలింగమూర్తిని కలెక్టర్ ఆదేశించారు. డ్వామాకు సంబంధించి 2021-22 ఆర్థిక సంవత్సరంలో పెండింగ్ పనులపై కలెక్టర్ ఆరా తీయగా 286 పనులను క్లోజ్ చేయడం జరిగిందని, అదే విధంగా అమృత్ సరోవర్ ట్యాంకులకు సంబంధించి నిర్దేశించిన 75 ట్యాంకుల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని, హార్టికల్చర్ ప్లాంటేషన్ కు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేశామని డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు వివరించారు.

డిజిటల్​ లైబ్రరీలకు.. స్థలం గురించండి..

పంచాయతీ రాజ్ కు సంబంధించి ప్రాధాన్యతా భవనాల పనులలో వేగం పెరగాలని కలెక్టర్ ఆదేశించారు.. డిజిటల్ లైబ్రరీలకు అవసరమైన స్థలాన్ని గుర్తించి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకొని సరైన సమయంలో నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. ఎక్స్పెండిచర్, స్టేజ్ కన్వర్షన్ మీద మెరుగైన పురోగతి సాధించాలన్నారు.సెప్టెంబర్ నెలాఖరు నాటికి  పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ ఎస్ఈని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ఈ సుబ్రమణ్యం, డిఈలు తదితరులు పాల్గొన్నారు.

About Author