రాబోయే ఎన్నికల్లో వైసిపి అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి..
1 min readకూటమికే అధికారం చేపట్టవలసిన బాధ్యత ప్రజలపై ఉంది
ఏలూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూటమి స్వీకరిస్తుంది
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిరీలు చేసిన అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టిడిపి, బిజెపి, జనసేన కూటమి ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి అన్నారు. ప్రజలను రాజకీయంగా చైతన్యవంతులు చేసే క్రమంలో టిడిపి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష్యసాధనగ దిశగా కొనసాగుతుందని అన్నారు. ఇందులో భాగంగా ఏలూరు 31 డివిజన్ లో కూటమి అభ్యర్థి బడేటి చంటి పాల్గొన్నారు. డివిజన్ లోని ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. కూటమి అధికారంలోకి వస్తే అందించే ప్రజా సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయా పథకాలపై వారికి అవగాహన కల్పించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కూటమి ని ఆశీర్వదించాలని కోరారు. అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజల సహకారం కోరుతున్నామని, ప్రజలంతా వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ముక్తకంఠంతో చెబుతున్నారు అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావలసిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. తమ ఓటుతో కూటమికి అధికారం కట్టబెట్టవలసిన బాధ్యత ప్రజలదని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించాల్సిన బాధ్యత కూటమిదని భరోసా నింపుతున్నామన్నారు. 2024లో వైసీపీకి బుద్ధి చెప్పే రీతిలో ప్రజా తీర్పు ఉంటుందని బడేటి చంటి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్, జనసేన అధ్యక్షులు కాశీ నరేష్,37వ డివిజన్ కార్పొరేటర్ నాయుడు పృద్వి శారద,37వ డివిజన్ ఇన్చార్జి నాయుడు సోము ,గుడిపూడి రవి, శ్రీనివాస్ నాయుడు, లక్ష్మణ్ నాయుడు, జిలాని జనసేన డివిజన్ ఇన్చార్జి, గరపాటి ప్రేమ్ మరియు టిడిపి జనసేన కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.