రూ.10.36 కోట్ల పెండింగ్ బిల్లులు అప్లోడ్ చేయండి
1 min read– 1080 పాఠశాలలకు 61 మాత్రమే ఎంబుక్ చేశారా..
– వెంటనే పూర్తి చేయాలని విద్యాధికారులను ఆదేశించిన జేసీ( ఆసరా & వెల్ఫేర్)
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : జిల్లాలలో 1080 పాఠశాలలకు 61 మాత్రమే ఎంబుక్ చేసినట్లు నివేదిక ఇచ్చారని, వెంటనే పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ( ఆసరా మరియు వెల్ఫేర్) ఎంకేవీ శ్రీనివాసులు విద్యాశాఖాధికారి, సర్వసశిక్ష అభియాన్ అధికారులను ఆదేశించారు. జేసీ తన ఛాంబరులో డీఈఓ సాయిరాం, సమగ్ర సర్వశిక్ష అభియాన్ కో ఆర్డినేటర్ వేణుగోపాల్, డీఈఈ రాగప్ప, అసిస్టెంట్ ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జేసీ ఎంకేవీ శ్రీనివాసులు మాట్లాడుతూ ఫీల్డ్ ఇంజినీర్ల వద్ద పెండింగ్లో ఉన్న 10 కోట్ల 36 లక్షల బిల్ల్స్ ను వెంటనే అప్లోడ్ చేయాలని తెలియజేశారు. 1080 పాఠశాలలకు గాను 135మాత్రమే ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ పూర్తయిందని మిగిలినవి పూర్తి చేసి స్కూల్ ప్రాజెక్ట్ ల క్లోజర్ చేయాలని ఆదేశించారు. గురువారం నుండి వరుసగా మూడు రోజులు ప్రతిరోజు రెండు కేంద్రాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, సెక్టోరల్ ఆఫీసర్లు,ఇంజనీర్లతోవర్క్ షాప్ నిర్వహించి సాంకేతిక సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తూ ,సందేహాలు తీరుస్తూ, నాడు నేడు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని వర్క్ షాపులకు హాజరుకాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జేసీ వెల్లడించారు.