PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఉప్పెన’ భామకు.. బంపర్​ ఆఫర్​

1 min read

ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టికి సూపర్‌స్టార్‌ మహేశ్‌తో నటించే అవకాశం వచ్చింది. మహేష్​ తన 27వ చిత్రం ‘ సర్కారువారిపాట ’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. తర్వాత .. రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి సినిమా కంటే.. ముందు మరో సినిమా తీయనున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌ సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయని టాక్‌. ఈ సినిమాకు సంబంధించిన వర్క్సైలెంట్‌గా జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌ ఇంటర్వ్యూలోనూ అనీల్‌ రావిపూడి మహేశ్‌తో చేయబోయే సినిమా గురించి ఇన్‌డైరెక్ట్‌గా హింట్‌ ఇచ్చాడు. తాజాగా మహేశ్‌, అనీల్‌ రావిపూడి సినిమాకు సంబంధించి మరో వార్త నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. అదేంటంటే.. రీసెంట్‌గా విడుదలైన ‘ఉప్పెన’తో క్రేజ్‌ తెచ్చుకున్న హీరోయిన్‌ కృతిశెట్టిని ఈ సినిమాలో మహేశ్‌ జోడీగా నటింప చేయనున్నారు. ఇదే కనుక నిజమైతే సూపర్‌స్టార్‌ సినిమాలో అవకాశం దక్కించుకుని కృతి బంపర్‌ ఆఫర్‌ కొట్టేసినట్లే అంటున్నారు మరి.
సూపర్​ స్టార్​ మహేష్​ బాబు, కొత్త సినిమా, రాజమౌళి, ఉప్పెన భామ


About Author