బీసీ ఎమ్మెల్యేపై అగ్ర కుల దాడి హేయమైన చర్య
1 min read– కర్నూలు జిల్లా కురువ సంఘం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బిసి ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి శంకర నారాయణ పై సర్పంచ్ నాగభూషణ్ రెడ్డి దాడి చేయడాన్ని కర్నూలు జిల్లా కురువ సంఘం గౌరవ అధ్యక్షులు కే .కిష్టన్న , జిల్లా అధ్యక్షుడు పత్తికొండ శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ఎం .కే . రంగస్వామి , జిల్లా కోశాధికారి కే సి .నాగన్న నగర అధ్యక్ష ,కార్యదర్శి తవుడు శ్రీనివాసులు ,బి .రామకృష్ణ ,తాలూకా అధ్యక్షులు సురేంద్ర ,మండల అధ్యక్షులు కురువ హనుమంతు ,తాలూకా కార్యదర్శి బురుజుల పక్కీరప్ప ,ధనుంజయ లు తీవ్రంగా ఖండిస్తున్నాము .బుధవారం నగరం లో జరిగిన సమావేశం లో జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ అభివృద్ది మాటున దాడి అన్నది వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనం.అగ్రవర్ణాల వారి ఉద్దేశం ఏమై ఉంటుందంటే కురువలు ఉన్నత పదవులలో ఉండడం వారికి ఇష్టం లేక దాడులు చేయిస్తున్నారు ఇది బి. సి లను అణచివేయడమే అవుతుంది . .కేవలం బి .సి . కులస్థుడైన ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి శంకరనారాయణ పైన దాడి చేయడం హేయమైన చర్య , అనంతపురం జిల్లా వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా అధ్యక్షులుగా ఉండి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన ఒక బీసీ నాయకుడి పై ఇలా దాడి చేయడం, గతంలో కూడా తప్పుడు ఆరోపణలు చేయడం వైసీపీ పార్టీలో పేరుకే బీసీ పార్టీ అని చెప్పుకుంటున్న వైసిపి నాయకులు దీనిపై సమాధానం చెప్పాలని వారు తీవ్రంగా మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో మరియు ప్రభుత్వ ల్యాండ్ మాఫియా పేరుతొ ఒక సర్పంచ్ అగ్రకుల అహంకారంతో కురువలపై దాడి చేయించడం సిగ్గుచేటు. దీని వెనకాల ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదని తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఇలాగే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా కురువలు తగిన బుద్ధి చెప్తారని వారు హితవు పలికారు .పెనుగొండ నియోజకవర్గం సోమందపల్లి మండలం ఈదుల బళ్లాపురం గ్రామ సర్పంచ్ నాగభూషణ్ రెడ్డి దుర్భాషలాడుతూ,దాడిచేయించడం సబబు కాదు .అదే జిల్లాలో కురువలు దాడి చేయదలుచుకుంటే నిన్ను ఆ గ్రామం నుంచి తరిమి వేయగల సత్తా మాకు ఉంది .అయినా మేము అలాంటి పనులు ఎక్కడ చేయడం లేదని వారు అన్నారు.దుర్బాషలాడిన సర్పంచ్ నాగభూషణం రెడ్డి ని మరియు దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు .ఈ సమావేశం లో జిల్లా నాయకులు బి .సి .తిరుపాల్ ,బి .వెంకటేశ్వర్లు ,బి .బాలరాజు ,శ్రీరాములు ,పెద్దపాడు పుల్లన్న తదితరులు పాల్గొన్నారు .
నియోజకవర్గం, వైసీపీ, దాడులు, సర్పంచ్,