PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 (UPSF-AP )…3వ వార్షికోత్సవం…

1 min read

– బెస్ట్ టీచర్స్ అవార్డుల పురస్కారాలు.. 

పల్లెవెలుగు కల్లూరు అర్బన్ : రాష్ట్రం లో ప్రైవేటు విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న చిన్న బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల కొరకు ఒక ప్రత్యేకమైన వేదికను ఏర్పాటు చేసి, చిన్న పాఠశాలల పక్షంగా పెద్ద గళాన్ని వినిపిస్తున్న *”అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (UPSF-AP)”* యొక్క 3వ వార్షికోత్సవం  జిల్లా పరిషత్ ఆడిటోరియం కర్నూలు లో అత్యంత ఘనంగా నిర్వహించారు. గురువారం ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిథులుగా  ఎన్ హనుమంతరావు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కర్నూలు, జి వనజ కుమారి ఎంఈఓ -2 కల్లూరు, ఎస్ ప్రభావతమ్మ ఎంఈఓ 1 కర్నూల్ అర్బన్. కే వినోద్ ఎంఈఓ కర్నూల్ రూరల్, శేషు యాదవ్ మాజీ కార్పొరేటర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం కొరకు 100 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని సత్కరించి పురస్కారాలను అందజేశారు.  ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా విశేషమైన స్పందన లభించడం చాలా గర్వకారణం అని ఆ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు  ప్రవీణ్ కంటి మహంతి  పేర్కొన్నారు. దీనిని బట్టి రాష్ట్రంలో అతి స్వల్ప కాలంలో ఇంతటి ఆదరణ పొందుకోవడానికి, చిన్న బడ్జెట్ పాఠశాలలకు ఈ ఫెడరేషన్ మీద నమ్మకం కలగడమే కారణమని ఆయన అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు  వేల్పుల సుదర్శన్  మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ ఫెడరేషన్ ప్రతి చిన్న పాఠశాల యొక్క కరస్పాండెంట్ కు వెన్ను దన్నుగా నిలబడి అనేక రకాలుగా సేవలు అందించుటకు, చిన్న ప్రైవేట్ పాఠశాలల సంక్షేమం మరియు అభివృద్ధి కొరకు అన్ని విధముల కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే గత మూడు సంవత్సరాలలో అటు కోవిడ్ వలన, ఇటు ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాల వలన నష్టపోయిన ప్రైవేట్ విద్యావ్యవస్థను పునరుద్ధరించుటకు అహర్నిశలు పనిచేస్తామని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర డైరెక్టర్  చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని బడ్జెట్ పాఠశాలలను ఏకీకృతం చేసి సంఘీటీతంగా పోరాటం చేసి సమస్యలను పరిష్కరించేవరకు కృషి చేస్తామని తెలిపారు.UPSF జిల్లా అధ్యక్షులు N. క్రిస్టోఫర్ మాట్లాడుతు మా యొక్క ప్రధాన డిమాండ్ ప్రయివేట్ పాఠశాలను  రాష్ట్రంలోని కార్పొరేట్ మరియు సెమీకార్పొరేట్ పాఠశాలల నుండి వేరు చేయాలి. 10 సంవత్సరాలనుండి నడపబడుతున్న బడ్జెట్ పాఠశాలలకు శాశ్వత గుర్తింపు ఇవ్వాలి అని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా జనరల్ సెక్రటరీ సి కుమార్, జిల్లా ట్రెజరర్ ఎం. శ్రీనివాసులు, వైస్ ప్రెసిడెంట్ రంగనాథ్ రెడ్డి, సిటీ ప్రెసిడెంట్ హెబ్సిబా రాణి, భాను చిరంజీవి, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. 

About Author