పట్టణ ప్రజల సహాయ సహకారాలతోనే పట్టణ అభివృద్ధి సాద్యం
1 min read– ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు నడుచుకొంటూ రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణం లోని ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి GM టాకీస్ వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమం నిర్మాణ పనులను బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరిశీలించారు .రోడ్డు కు ఇరు వైపులా ఆక్రమంచుకొని కొని ఉన్న దుకానదారులను రోడ్డు వెడల్పు కార్యక్రమానికి అందరూ సహకరించాలని చెప్పారు.అలాగే డ్రైనేజీ వ్యవస్థ ను ఆధునికరించాలని పంచాయతీ రాజ్ శాఖ డివిజనల్ ఇంజినీర్ నాగ శ్రీనివాసుల ను ,రోడ్లు భవనాలు శాఖ ఇంజినీర్ ను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు ఆదేశించారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ బనగానపల్లె పట్టణం దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణమని అందులో భాగంగానే ఇప్పుడున్న జనాభాకు తగినట్టుగా ట్రాఫిక్ రహదారులు లేకపోవడంతో పట్టణవాసులు చాలా సంవత్సరాల నుంచి ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారని ప్రజల ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను తీర్చడానికే తాను పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి జిఎం టాకీస్ వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అందులో భాగంగానే ఈరోజు రోడ్డు వెడల్పు కార్యక్రమ పనులను అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని చెప్పారు. అలాగే రోడ్డు వెడల్పు కార్యక్రమానికి సహకరించిన పట్టణ ప్రజలకు అందరికీ తాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. పట్టణ అభివృద్ధికి కొంతమంది అవరోధాలు సృష్టించడం జరిగిందని అయితే ప్రజల ఆశీర్వాదంతో తాను రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పారు. పనుల మీద కొంతమంది అసత్య ప్రచారాలతో పాటు ప్రచారం మాధ్యమాల్లో తప్పుడు వార్తలను పెట్టడం జరిగిందని త్వరలోనే పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులో వచ్చిన తర్వాత వారందరికీ ఒక చెంపపెట్టు లాంటిదని చెప్పారు. అభివృద్ధికి చాలామంది అడ్డంకులు సృష్టిస్తున్నారని అయితే ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన తాను అభివృద్ధి మీద దృష్టి పెట్టడం జరిగిందని తాను అభివృద్ధి పనుల ద్వారా బుద్ధి చెప్తానని చెప్పారు. అనంతరం ఎస్సీ బాలికల హాస్టల్ లో డ్రైనేజీ సమస్య ఉండడంతో అక్కడ కూడా వెళ్లి డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని సమర్థిక శాఖ అధికారులకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆదేశించడం జరిగింది. భవిష్యవాణి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా బనగానపల్లె పట్టణం 12 ఆమడాల పట్టణముగా విరాజిల్లుతుందని అందులో భాగంగానే ఆయన చెప్పిన భవిష్యత్తు వానిలో భాగంగానే నేడు బనగానపల్లె పట్టణం దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం లో అవుకు మండల వైఎస్సార్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి ,సిద్దం రెడ్డి రామ్ మోహన్ రెడ్డి,వైఎస్సార్ పార్టీ నాయకులు డాక్టర్ మహమ్మద్ హుస్సైన్ ,అత్తార్ జాహీద్ హుస్సైన్,మండల అభివృద్ది అధికారి శివ రామయ్య ,పంచాయతీ రాజ్ డివిజనల్ ఇంజినీర్ నాగ శ్రీనివాసులు ,రోడ్లు భవనం శాఖ డివిజనల్ ఇంజినీర్,బండి బ్రహ్మనంద రెడ్డి,ఎర్రగుడి రామ సుబ్బారెడ్డి,బనగానపల్లె వ్యవసాయ మార్కెట్ ఉపాధ్యక్షుడు జనార్ధన్రెడ్డి,గౌండకంబగిరి,వైఎస్సార్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.