‘ఉరుకుంద’ భక్తులకు…కూలింగ్ వాటర్
1 min read
కౌతాళం, న్యూస్ నేడు: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం నందు ఎండాకాలం తీవ్రత ఉండటం వలన భక్తుల కొరకు సుమరు ₹. 10 లక్షల విలువతో ఫిల్టర్ వాటర్ కూలింగ్ తో కూడిన వాటర్ ను దేవస్థాన డిప్యూటీ కమిషనర్ మేడిపల్లి విజయరాజు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. ఈ వేసవి కాలంలో దృష్టిలో ఉంచుకొని దేవాలయం వచ్చు భక్తులు ఈ వేసవి కాలంలో నీటిని వృధా చేయరాదు.. పరిశుభ్రతను పాటించవలెను. స్వామివారిని దర్శించుకుని గుడి ఆవరణములో శుభ్రతను పాటించి వెళ్లవలసిందిగా కోరుతున్నామని వారు కోరారు..ఈ కార్యక్రమంలో దేవస్థాన సూపర్డెంట్లు జె.కె.మల్లికార్జున కే వెంకటేశ్వర్లు, దేవస్థాన వేద పండితులు మోహన మురళీకృష్ణ శర్మ, ప్రధాన అర్చకులు ఈరప్ప స్వామి ఉప ప్రధానార్చకులు మాదేవా స్వామి, అర్చకులు శివన్న స్వామి, నాగరాజ్ స్వామి, సీనియర్ అసిస్టెంట్లు కిరణ్ కుమార్, విజయ్ కుమార్ జూనియర్ అసిస్టెంట్లు కుమారయ్య, వీరేష్ మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.