ఉప్పలదడియలో 9 నుంచి ఉరుసు -జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
1 min read
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియ గ్రామంలో ఈనెల 9వ తేదీ నుంచి శ్రీశ్రీశ్రీ హజరత్ సయ్యద్ సుల్తాన్ షా ఖాద్రి షర్ఫీ స్వాములవారి ఉరుసు మహోత్సవం నిర్వహిస్తున్నట్లు గురువులు మరియు కమిటీ నిర్వహకులు తెలిపారు. 9వ తేదీన గంధం 10వ తేదీన ఉరుసు 11వ తేదీన జియారత్ ఉదయం గురు సమాధి సాయంత్రం 3 గంటలకు కిస్తీ బహువినోదం జరుగుతాయని అన్నారు.జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు:ఉరుసు మహోత్సవం సందర్భంగా గ్రామంలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు 10వ తేదీన ఉదయం కబడ్డీ పోటీలు ప్రారంభం అవుతాయని,కబడ్డీ ఆటలు పోటీల్లో ఆడదలచిన జట్లు 9వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల 500 రూపాయలు చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలని అన్నారు.మొదటి బహుమతి- 15,016,రెండవ బహుమతి-10,016,మూడవ బహుమతి-5,016,నాలుగవ బహుమతి-3,016 మరిన్ని వివరాలకు సాయి చరణ్-9959109021, రహంతుల్లా-8897705277 అను నెంబర్లకు సంప్రదించాలని వారు తెలిపారు.