అంగరంగ వైభవంగా ఉరుసు మహోత్సవం
1 min read– వేల సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్న భక్తులు
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండల పరిధిలోని గంజిహళ్లి గ్రామంలో వెలసిన మహాత్మా బడేసాహేబ్ ఉరుసు మహోత్సవం సందర్భంగా గ్రామంలో పెద్దలు, మహిళలు, వృద్ధులు, యువకులు, పిల్లలు, మహాత్మా బడేసాహేబ్ గారి దర్గ వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహత్మ బడేసాహేబ్ ఉరుసు సందర్భంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలముల భక్తులు వేల సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఉరుసు సందర్భంగా మిఠాయి అంగళ్లు, గాజుల షాప్ లు, ఆటబొమ్మల అంగళ్లు వచ్చాయి. అలాగే ఈ ఉరుసు సందర్భంగా దర్గా పీఠదీపతులు సయ్యద్ చిన్న ముద్గల్, మాబు సాహేబ్ లు ఉరుసుకు వచ్చిన భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అలాగే దర్గలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్గా పీఠదీపతులు సయ్యద్ చిన్న ముద్దోల్ చూసుకుంటున్నారు. ఉరుసు మహెూత్సవం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.