NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈ నెల 26న ఉరుసు మహోత్సవాలు

1 min read

– ఈ నెల 25న గంధం, 26న ఉరుసు మహోత్సవం, 27న జియారత్
– ఉరుసుకు వచ్చే భక్తులకు భోజనం,వసతి, మంచినీటి సౌకర్యం ఏర్పాటు
– ఉరుసులో ఆకతాయిలు అల్లర్లు సృష్టిస్తే అలాంటి వారిని పోలీసులకు అప్పగిస్తాం: తాత ముని మనవడు ముద్గోల్

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండల పరిధిలోని గంజహళ్లి గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ మహాత్మా గంజిహల్లి బడే సాహెబ్ తాత ఉరుసు మహోత్సవ కార్యక్రమం శ్రీశ్రీశ్రీ మహాత్మ బడేసాహెబ్ తాత ముని మనవడు ముద్గోల్ ఆధ్వర్యంలో జరుగుతుందని ఆలయ నిర్వాహకులు ఆర్ కుబేర రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తాత ముని మనవడు ముద్గోల్ మాట్లాడుతూ గంజహళ్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ మహాత్మా బడే సాహెబ్ ఉరుసు మహోత్సవాలు ఈ నెల 25వ తేదీ శనివారం గంధం , 26వ తేదీ ఆదివారం ఉరుసు , 27వ తేదీ సోమవారం జియారత్ నిర్వహిస్తు న్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ఉరుసు సందర్భంగా దర్గాకు వచ్చే భక్తులకు త్రాగునీరు, వసతి, ఉచిత భోజనం, చలువ పందిళ్ళు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.కావున భక్తులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తమ కోరికలను తీర్చుకోవాలని ఆయన తెలిపారు. ఈ ఉరుసు మహోత్సవంలో పెద్ద ఎత్తున జరుగుతుందని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా తగిన చర్యలు చేపడుతున్నామని అన్నారు. కావున భక్తులు ఈ స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఉరుసులో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన, అల్లర్లు సృష్టించిన, ఆకతాయిలు అల్లరి చేష్టలు చేసిన అలాంటి వారిని పోలీసులకు అప్పగిస్తామని అన్నారు.

About Author