యూఎస్ ఫెడ్ ఎఫెక్ట్.. నష్టాల్లో సూచీలు
1 min readపల్లెవెలుగువెబ్ : స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ అంశాలు, దేశీయంగా చమురు ధరల పెరుగుదల స్టాక్ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యలభ్యత తగ్గించే ప్రక్రియ వేగంగా ఉండనుందని యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రకటించిన నేపథ్యంలో ఆ ప్రభావం సూచీలపై పడనుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు 20 శాతం మేర పెరిగాయి. ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 240 పాయింట్ల నష్టంతో 57051 వద్ద, నిఫ్టీ 72 పాయింట్ల నష్టంతో 17045 వద్ద ట్రేడ్ అవుతోంది.