యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచనుందన్న వార్తల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల సవరణ నేపథ్యంలో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. దీంతో భారత మార్కెట్ మీద కూడ ప్రతికూల ప్రభావం చూపింది. నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయి.. 15,691 వద్ద ట్రేడింగ్ ముగియగా.. బ్యాంక్ నిఫ్టీ 478 పాయింట్లు నష్టపోయి 34,524 వద్ద ట్రేడింగ్ ముగిసింది. సెన్సెక్స్ 178 పాయింట్ల నష్టంతో 52,323 వద్ద ట్రేడింగ్ మగించింది.