సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని అధ్యక్షుడికి అమెరికా ఆఫర్.. ఆయన ఏం చెప్పారంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ముందుకు సాగుతోంది. కీవ్ నగర వీధుల్లోకి రష్యాన్ సైనికులు చొచ్చుకొచ్చారు. వీధుల్లో బాంబుల మోత మొదలైంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడికి అమెరికా బంపర్ ఆఫర్ ఇచ్చింది. అధ్యక్షుడు జెలెన్ స్కీను సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ప్రకటించింది. అమెరికా ఆఫర్ పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. అమెరికా ఇచ్చిన ఆఫర్ను జెలెన్స్కీ తిరస్కరించారు. యుద్ధం ఉక్రెయిన్లో జరుగుతోందని, తనకు ఆయుధాలు కావాలని, పలాయనం కోసం మార్గం కాదని జెలెన్స్కీ స్పష్టం చేశారు.