ఉషూ క్రీడాకారులను ప్రోత్సహించాలి: టీ.జీ .వెంకటేష్
1 min read5 వ జిల్లా స్థాయి ఉషూ పోటీలను ప్రారంభించిన టీ.జీ .వెంకటేష్
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: స్థానిక కిడ్స్ వరల్డ్ రోశయ్య కమిటీ హాల్ నందు 5 వ జిల్లా స్థాయి ఉషూ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు టీ.జీ .వెంకటేష్ గారు ఈ పోటీలను ప్రారంభించారు. ఉషూ క్రీడను ఉద్దేశించి అభినందనలు తెలుపుతూ ఇంతమంది ఉషూ(మార్షల్ ఆర్ట్స్)క్రీడలను చూస్తుంటే చాలా సంతోషంగానూ, గౌరవ కారణంగానూ ఉందని ఉషూ అభ్యసించడం వల్ల పట్టుదల, ఏకాగ్రత ,క్రమశిక్షణ,ఆత్మస్థైర్యం వస్తుందని అంతేకాకుండా ఉషూ క్రీడాకారులను ఎప్పుడు ప్రోత్సహించాలని.నేను కూడా ప్రోత్సహిస్తానాని పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఉషూ సంఘం అధ్యక్షులు గూడూరు గోపాల్ పాల్గొన్నారు. జిల్లా ఉషూ సంఘం కార్యదర్శి టి.శ్రీనివాసులు మాట్లాడుతూ 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారని ఈ పోటీలకు అండర్ 12,15,17,18 వయస్సు విభాగములో చెందిన బాలబాలికలు పాల్గొన్నారు.ఈ ఉషూ పోటీలలో సెకండ్ ఫామ్,నాన్ కాన్,చాన్ కాన్ ఈ ఈవెంట్స్లో పోటీలను నిర్వహించామన్నారు.అదే విధముగా రెఫరీ అండ్ జడ్చర్ల గా గౌస్,చిన్న శ్రీనివాసులు,చిరంజీవి,సుధాకర్,లు పాల్గొన్నారని. అనంతరం క్రీడాకారులు ఉషూ క్రీడా విన్యాసాలు ప్రదర్శన చేశారని ఉషూ సంఘం కార్యదర్శి టి. శ్రీనివాసులు తెలిపారు.