నంద్యాలకు బయలుదేరిన ఉత్సవ మూర్తులు
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి సమేత మహానంది శివ స్వామి ఉత్సవమూర్తులు మహానంది నుండి నంద్యాలకు మంగళవారం సాయంత్రం బయలుదేరి వెళ్ళాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహానందిలో జరిగే ఉత్సవాలకు సంబంధించి పెళ్లి పెద్దగా నంద్యాలలో వెలసిన శ్రీ బ్రహ్మానందం ఈశ్వర స్వామిని ఆహ్వానించడానికి వెళ్లినట్లు వేద పండితులు రవిశంకర్ అవధాని పేర్కొన్నారు. ప్రతి ఏడు ఆనవాయితీ ప్రకారం నంద్యాలకు వెళ్లి తిరిగి మరుసటి రోజు బ్రహ్మానందయ్యేశ్వర స్వామి తో సహా మహానందికి చేరుకుంటారని తెలిపారు. ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి మరియు చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ఏఈఓ మధు పాలకమండలి సభ్యులు మల్లికార్జున తదితరులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో నంద్యాలకు బయలుదేరి వెళ్లాయి. తిరిగి బుధవారం రాత్రికి మహానంది క్షేత్రానికి బ్రహ్మ నందీశ్వర స్వామి తో సహా చేరుకోనున్నట్లు వేద పండితులు రవిశంకర్ అవధాని తెలిపారు.