ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దేశం కోసం చేసిన త్యాగం మరువలేనిది
1 min read
జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య
పల్లెవెలుగు , కర్నూలు: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దేశం కోసం చేసిన త్యాగం మరువలేనిదని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య పేర్కొన్నారు.శనివారం ఉదయం 178 వ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలు లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జాయింట్ కలెక్టర్ నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, గొప్ప విప్లవకారుడు అన్నారు. మల్లారెడ్డి మరియు సీతమ్మ దంపతుల కుమారుడైన నరసింహారెడ్డి 1806 నవంబర్ 24న నంద్యాలలో రూపనగుడి గ్రామంలో జన్మించారన్నారు.. 1857లో ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం జరిగిందని అయితే అంతకు 10 సంవత్సరాల ముందే 1847లోనే నరసింహా రెడ్డి గారు ఈస్ట్ ఇండియా కంపెనీ మీద తిరుగుబాటు చేసిన చరిత్ర ఉందన్నారు.. ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఎదురుదాడి చేయడం,రైతులు కట్టే శిస్తుల పై వ్యతిరేక పోరాటం చేయడం ఆ విధంగా విప్లవకారుడిగా ప్రసిద్ధి చెందారన్నారు…. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు రెవెన్యూ శిస్తు కోసం రైతులను పట్టిపీడించడం వీటన్నిటికీ అయిన తిరుగుబాటు చేయడం ద్వారా శిస్తుభరణాన్ని కూడా ఆపారన్నారు… ట్రెజరీ ని ముట్టడించి బ్రిటిష్ అధికారిని హతమార్చడం జరిగిందన్నారు.. అందుకు సంబంధించి అతని మీద కేసు పెట్టి ఉరి తీయడం ద్వారా అతను వీర మరణం పొందారన్నారు… ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ఏ మాత్రం భయపడకుండా హక్కుల కోసం పోరాడి ఆయన జీవితాన్ని అంకితం చేశారన్నారు… ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాట పటిమ, వీరత్వం, పౌరుషం ప్రతి ఒకరికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం అన్నారు… సమాజం కోసం పనిచేయాలనే స్ఫూర్తిని ఇలాంటి గొప్ప వ్యక్తులను స్పూర్తిగా తీసుకొని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. స్వప్రయోజనం కోసం కాకుండా దేశం కోసం, సమాజం కోసం ప్రజల సంక్షేమ కోసం తిరుగుబాటు చేసి ప్రాణాలను అర్పించారన్నారు.. అతను కర్నూలు వాసి అవడం మనందరికి గర్వ కారణమన్నారు.అంతకుముందు కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, నంద్యాల పార్లమెంటు సభ్యులు శ్రీమతి బైరెడ్డి శబరి, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత, జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య లు స్థానిక ఏ క్యాంప్ లో ఉన్న ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు .కార్యక్రమంలో డిఆర్ఓ సి వెంకట నారాయణమ్మ, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్ర బాబు, డీఎంహెచ్వో శాంతి కళ, పర్యాటక శాఖ అధికారి విజయ, మెప్మా పీడీ నాగ శివలీల, ఎంప్లాయిమెంట్ అధికారి దీప్తి, తదితరులు పాల్గొన్నారు.
