వీ.కే. నగర్ లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మించండి: సీపీఐ
1 min readపల్లెవెలుగు వెబ్, పత్తికొండ: పట్టణంలోని వి. కె. ఆదినారాయణ రెడ్డి నగర్ నందు సి.సి.రోడ్లు, మురుగు కాలువలు నిర్మించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్. గురుదాసు, సీపీఐ పత్తికొండ మండల,పట్టణ కార్యదర్సులు డి. రాజా సాహెబ్,బి. సురేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సీపీఐ కార్యాలయం చదువుల రామయ్య భవన్ నుండి పత్తికొండ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు సీపీఐ పత్తికొండ పట్టణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమన్ని ఉద్దేశించి ఆర్. గురుదాసు, డి. రాజా సాహెబ్, బి. సురేంద్ర కుమార్ లు మాట్లాడుతూ వి. కె. నగర్ నందు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాడం లో పాలకులు విఫలమయ్యారని అన్నారు. ఈ కాలనీ 2007 సంవత్సరం లో నిర్మాణం జరిగిందని నాటి నుండి నేటివరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కాలనిలో దాదాపు 100 కుటుంబాలు వారు నివాసము వుంటున్నారని తెలిపారు. సి. సి. రోడ్లు, మురుగు కాలువలు లేకపోవడంతో ఎక్కడి నీళ్లు అక్కడే ఉండి పోవడం వల్ల తీవ్ర అపరిశుభ్రంగా మురుగు నీరు నిల్వ ఉండడంతో కాలనీ ప్రజలు వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారని కరోనా మహమ్మారి సోకె ప్రమాదం ఉందని తెలిపారు. ఈ కాలనీలో విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేయలేదని చివరి ఇండ్లు లో నివసిస్తున్న కుటుంబాలు అంధకారంలో మగ్గుతున్నరని ఆందోళన వ్యక్తం చేశారు.