NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

25 ఏళ్లవారికి కూడ టీకా వేయండి: సోనియా గాంధీ

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్: దేశంలో 25ఏళ్లు పైబ‌డిన వారందరికీ టీకా వేయాల‌ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ డిమాండ్ చేశారు. కోవిడ్ వ్యాక్సినేష‌న్ అర్హత ప్రాధాన్యత‌ను మార్చాల‌ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆస్తమా, మ‌ధుమేహం, గుండెనొప్పి త‌దిత‌ర స‌మ‌స్యలున్న వారికి కూడ వ్యాక్సినేష‌న్ ఇవ్వాల‌ని కోరారు. సీడ‌బ్ల్యూసీ స‌మావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వార నిర్వహించారు. ఈ స‌మావేశంలో ఆమె పాల్గొన్నారు. విదేశీ టీకాల‌ను అత్యవ‌స‌రంగా ఉప‌యోగించ‌డానికి అనుమ‌తివ్వడాన్ని ఆమె ఆహ్వానించారు. కోవిడ్ టీకాల‌ను విదేశాల‌కు ఎగుమ‌తి చేయ‌డాన్ని సోనియా ప్రశ్నించారు. కోవిడ్ నివార‌ణ‌కు అవ‌స‌ర‌మైన వైద్య ప‌రికరాల మీద జీఎస్టీ ర‌ద్దు చేయాల‌ని కోరారు. కోవిడ్ మీద పోరును కేంద్ర ప్రభుత్వం స‌మ‌ర్థవంతంగా ఎదుర్కోలేక‌పోతోంద‌ని విమ‌ర్శించారు.

About Author