NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హజ్ యాత్రకు వెళ్ళే యాత్రికులకు, వ్యాక్సినేషన్ శిబిరం ఏర్పాటు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు పట్టణం లో కింగ్ మార్కెట్ దగ్గర ఉన్న ఈడెన్ గార్డెన్ కమ్యూనిటీ హాల్ నందు హజ్ యాత్రకు కు వెళ్ళే యాత్రికులకు, వ్యాక్సినేషన్ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినదని  జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్.పి.శాంతికళ  తెలిపారు.   ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ హజ్ యాత్రికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన టీకాలను వేసి సర్టిఫికేట్ ఇస్తామని  తెలిపారు , హజ్ యాత్రికులందరూ ఎలాంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్ (ఓరల్ పోలియో వ్యాక్సిన్, మేని0న్గోకోకల్, ఇన్ ఫ్లూ ఎంజా వ్యాక్సిన్స్ ) వేయించుకొని సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు.      ఈ కార్యక్రమం నందు  జిల్లా వ్యాదినిరోదక టీకాల అధికారి డాక్టర్ వై. నాగప్రసాద్ బాబు , డిస్ట్రిక్ట్ ఎపిడమాలజిస్ట్ వేణుగోపాల్ ,  పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు , ఆరోగ్య పర్యవేక్షకులు శివకుమార్ , స్టాఫ్ నర్స్ లు , ఆరోగ్య కార్యకర్తలు , ఆశా కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు. 

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *