PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బనగానపల్లెలో గాలికుంటు వ్యాధి టీకాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో.పశువుల్లో వ్యాప్తి చెందే గాలికుంటువ్యాధినినివారించేందుకు టీకాలు వేయించాలని పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ మారుతి సకారామ్ తెలిపారు. శుక్రవారం బనగానపల్లె పట్టణంలో గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి సోకిన పశువులు మేత మేయకుండా అనారోగ్యం బారిన పడుతాయని తెలిపారు. దీని వల్ల వాటిలో పాలదిగుబడి సామర్థ్యం తగ్గుతుందని,సకాలంలో ఎదకు రాకుండా ఉండి చూలు నిలువదని పేర్కొన్నారు.వ్యాధిసోకినపశువుఎండతాకిడికితీవ్రంగాఆయాసపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, పశు వైద్య సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.

About Author