కోలుకున్న 9 నెలల తర్వాతే టీకా..!
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన వైరస్ నుంచి కోలుకున్న 9నెలల తర్వాతే టీకా వేయించుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని టీకా కార్యక్రమం పై ఏర్పడిన జాతీయ సాంకేతిక సలహా బృందం సిఫారసు చేసింది. వ్యవధి ఎక్కువ ఉంటే.. శరీరంలో యాంటీబాడీలు ఎక్కువగా వృద్ధి చెందుతాయని కమిటీ తెలిపింది. గతంలో ఆరు నెలల వ్యవధి ఉండాలని సూచించిన కమిటీ.. ఇప్పుడు 9నెలలు ఉండాలని సిఫారసు చేసింది. దీని మీద కేంద్ర ఆరోగ్య శాఖ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.