PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం చేయాలి

1 min read

-టీడీపీ మండల కన్వీనర్ ఓబుల్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం చేయాలని, కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు, కరోనా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని టీడీపీ మండల కన్వీనర్ ఓబుల్ రెడ్డి, పగిడ్యాల మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు బుధవారం తహసీల్దార్​ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్​ రాజశేఖర్​ బాబుకు అందజేశారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ ఓబుల్ రెడ్డి, పలుచాని మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ  కోవిడ్​ బాధిత కుటుంబాలకు రూ.10వేలు ఇవ్వాలని, జీవనోపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్స్ కు,భవన నిర్మాణ కార్మికులకు,నిరుపేదల కు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్​ చేశారు. అంతేకాక 65 లక్షల వ్యాక్సినేషన్​ ప్రజలకు ఉపయోగించాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మద్దిలేటి, నరసింహ రెడ్డి,మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

About Author