ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సిన్
1 min readపల్లెవెలుగు వెబ్: మూడో దశ కరోన వైరస్ తీవ్రంగా ఉండి.. పిల్లలకు రక్షణగా ఉండే తల్లులకు కరోన వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్ కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రత్యేక కమిటీ చేసిన సిఫారసులకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్టు తెలిపారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న వారందరికీ వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలన్న నిబంధన నుంచి వీరికి మినహాయింపు ఇస్తామని తెలిపారు. 15 నుంచి 20 లక్షల మంది తల్లులకు వీలైన త్వరగా టీకా వేసే ఏర్పాటు చేస్తామని తెలిపారు.