ఏపీలో టీనేజర్లకు వ్యాక్సిన్
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ పై ఉత్తర్వులు జారీ చేసింది. బూస్టర్ డోసు,15-18 ఏళ్ల వయసు గల వారికి వాక్సినేషన్ ప్రక్రియపై గైడ్ లైన్స్ విడుదల చేసింది. 15-18 ఏళ్లు దాటిన వారికి జనవరి ఒకటి నుంచి వాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు వయసు గల వారికి 2022 జనవరి 3 నుంచి వాక్సినేషన్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.