వ్యాక్సిన్ తిరస్కరణ.. 3,300 ఆర్మీ ఉద్యోగుల తొలగింపు !
1 min readపల్లెవెలుగువెబ్ : కరోన వ్యాక్సిన్ తీసుకోని వారి విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. టీకాలను తిరస్కరించిన 3,300 మంది అమెరికన్ సైనికులను వారి ఉద్యోగాల నుంచి తొలగించాలని యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ నిర్ణయించింది. అమెరికా మెరైన్ కార్ప్స్, వైమానిక దళం, నేవీ దళాల్లో కొవిడ్ వ్యాక్సిన్ తిరస్కరించిన వారిని డిశ్చార్జ్ చేయాలని అమెరికన్ ఆర్మీ నిర్ణయించింది.గత వారం అమెరికన్ ఆర్మీ విడుదల చేసిన సమాచారం ప్రకారం 3,300 మందికి పైగా సైనికులు వ్యాక్సిన్ పొందడానికి నిరాకరించారు. వ్యాక్సిన్ ను తిరస్కరించిన వారిని అధికారికంగా రాతపూర్వకంగా మందలించారు. టీకాలు వేయించుకోని వారిని డిశ్చార్జ్ చేయనున్నట్లు ఆర్మీ తెలిపింది.