NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏప్రిల్ 1న జ‌గ‌న్ కు వ్యాక్సిన్

1 min read

అమ‌రావ‌తి: ఏప్రిల్ 1న గుంటూరులో ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్యాక్సిన్​ వేయించుకోనున్నారు. భార‌త్ పేట వార్డులోని స‌చివాల‌యంలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయ‌న ప్రారంభిస్తారు. ఈ మేర‌కు మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ ప్రక‌ట‌న చేశారు. మంత్రి మోపిదేవి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని స‌చివాల‌యాల్లో వ్యాక్సినేష‌న్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామ‌ని తెలిపారు. వ్యాక్సినేష‌న్ ప‌ట్ల ప్రజ‌ల్లో ఉన్న అపోహ‌లు తొల‌గాల‌ని, ప్రభుత్వ సూచ‌న‌లు, స‌ల‌హాలు ప్రజ‌లు పాటించాల‌ని చెప్పారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వ్యాక్సినేష‌న్ లో ముందున్నట్టు ఆయ‌న తెలిపారు. కోవిడ్ నియంత్రణ‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్యలు తీసుకున్నట్టు ఆయ‌న చెప్పారు. సెకెండ్ వేవ్ ప‌రిస్థితి తీవ్రంగా ఉంటుంద‌ని.. ప్రజ‌లు అప్రమ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న తెలిపారు.

About Author