PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాడవాడలా బిషప్ జయరావు పొలిమేర జన్మదిన వేడుకలు..

1 min read

– బిషప్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  ఏలూరు కతోలిక పీఠాధిపతులు డాక్టర్  జయరావు పొలిమేర  జన్మదిన వేడుకలు  ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆర్.సి.యం దేవాలయాల  ఫాదర్లు సన్మానించి ఘనంగా సత్కరించారు. వాడవాడలా వృద్ధులుకు, వితంతువుల కు, పేద ప్రజలకు పలు సంఘాల వారు  పండ్లు, బిస్కెట్లు అందించి,వస్త్రధానాలు చేశారు. దైవ మార్గంలో,సేవా మార్గంలో జయ రావు పొలిమేర ప్రయాణం చేశారు. అగ్ని ప్రమాదాలు వరదలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బిషప్ జయ రావు  బాధితులకు ఆర్ సి ఎం సంస్థల  నుండి  సత్వర సేవలలు యుద్ధ ప్రాతిపదికన ప్రతినిధులతో అందించారు. ఈ సందర్భంగా బిషప్ హౌస్ లో జర్నలిస్టులు ప్రత్యేకంగా కలుసుకొని బిషప్ కు శాలువా కప్పి ఆయన ఆశీర్వాదం తీసుకుని  జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author