వైసీపీ కర్నూలు జిల్లా బీసీ విభాగ కార్యదర్శిగా వడ్డే వీరేష్ నియామకం
1 min read
న్యూస్ నేడు ఎమ్మిగనూరు: పట్టణానికి చెందిన యువ నాయకుడు వడ్డే వీరేష్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా బీసీ విభాగ కార్యదర్శిగా పార్టీ కేంద్ర కార్యాలయం నియమించింది.ఈ నియామకం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక మార్గదర్శకత్వంలో జరిగింది.ఈ సందర్భంగా వడ్డే వీరేష్ మాట్లాడుతూనన్ను ఈ బాధ్యతకు ఎంపిక చేసిన పార్టీ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మా నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక కి, పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బుట్టా శివ నీలకంఠ కి, రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షులు శ్రీ బుట్టా ప్రతుల్ కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. బీసీ వర్గాలకు న్యాయం జరిగే విధంగా, పార్టీ విలువలు పాటిస్తూ నా బాధ్యతలను నిర్వర్తిస్తాను. పార్టీ విజయానికి నన్ను ఉపయోగించుకునేలా పనిచేస్తాను. అని పేర్కొన్నారు.