NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైకాపా కౌన్సిల‌ర్ దారుణ హ‌త్య !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో వైకాపా కౌన్సిల‌ర్ తాళూరు సురేష్ దారుణ హ‌త్యకు గుర‌య్యాడు. సోమవారం కౌన్సిల‌ర్ సురేష్ జ‌న్మదినం కావ‌డంతో తిరుప‌తి వెళ్లి స్వామి వారి ద‌ర్శనం చేసుకుని.. సూళ్లురుపేట తిరిగి వ‌చ్చారు. ఇంటి వ‌ద్ద కుటుంబ స‌భ్యుల‌ను వ‌దిలి.. కారు తీసుకుని రైల్వే క్యాబిన్ రోడ్డులోని పార్కింగ్ స్థలానికి వెళ్లారు. గంట దాటినా సురేష్ ఇంటికి రాక‌పోవ‌డంతో.. కుటుంబ స‌భ్యులు వెతుకుతూ రైల్వే క్యాబిన్ రోడ్డుకి చేరుకున్నారు. అప్పటికే సురేష్ శ‌రీరమంతా క‌త్తిపోట్ల తో విగ‌త‌జీవిగా పడి ఉన్నాడు. పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని సురేష్ మృతి చెందిన‌ట్టు నిర్ధారించారు. సురేష్ సూళ్లురుపేట మున్సిపాలిటీలోని 16వ వార్డు కౌన్సిల‌ర్ గా ఉన్నారు. ఆయ‌న‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

About Author