NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘మా’ ఎన్నిక‌ల్లో వైకాపా జోక్యం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో వైకాపా జోక్యం చేసుకుందంటూ ప్రముఖ న‌టుడు ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ఈ మేర‌కు ఆయ‌న ఎన్నిక‌ల అధికారి కృష్ణమోహ‌న్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ ఇటీవ‌ల పోలింగ్ కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజీ ప‌రిశీలించిన ప్రకాశ్ రాజ్ తాజాగా ఎన్నిక‌ల అధికారికి లేఖ రాశారు. పోలింగ్ కేంద్రంలోకి వైకాపా కార్యక‌ర్త నూక‌ల సాంబ‌శివ‌రావును ఎలా అనుమ‌తించార‌ని ప్రశ్నించారు. సాంబ‌శివ‌రావు పోలింగ్ కేంద్రంలో ఓట‌ర్లను బెదిరించార‌ని, దీనిపైన త‌క్షణ‌మే చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో మంచు విష్ణుతో సాంబ‌శివ‌రావు ఉన్న ఫోటోల‌ను ప్రకాశ్ రాజ్ ఎన్నిక‌ల అధికారికి పంపించారు. జ‌గ్గయ్య పేట‌కు చెందిన సాంబ‌శివ‌రావు పై క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయంటూ ప్రకాశ్ రాజ్ తెలిపారు.

About Author