PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వజ్రోత్సవాల స్ఫూర్తితో ఉద్యమాలు ఉదృతం చేస్తాం – ఎస్టీయూ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆంధ్ర ప్రదేశ్ వజ్రోత్సవ సంబరాలు విజయవంతం అయిన స్ఫూర్తితో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు మరింత ఉదృతం చేస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్.తిమ్మన్న తెల్పారు.తేదీ 14-01-2024 న ఆదివారం స్థానిక సలాం ఖాన్ ఎస్టీయూ భవన్ కర్నూలు లో  విజయో త్సవసభ జిల్లా అధ్యక్షులు ఎస్. గోకారి అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఈనెల 12, 13 తేదీలలో రాష్ట్రోపాధ్యాయ సంఘం 75 వసంతాల వజ్రోత్సవ మహాసభలను పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినటువంటి ఉపాధ్యాయు లకు అందరికీ పేరు పేరునా ఉద్యమ అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా భారీ ఎత్తున ఊరేగింపు బహిరంగ సభ నిర్వహించ డానికి సహకరించిన కర్నూలు నగర ప్రజలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, పోలీసు సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది, ఇందుకు సహకరించిన కర్నూలు జిల్లా నాయకులందరి కీ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజే స్తున్నామని, ఇదే స్ఫూర్తితో, రెట్టింపు ఉత్సాహంతో రాబోయే రోజుల్లో ఉద్యమా లను ఉదృతం చేస్తామని, ఉపాధ్యాయుల ఉద్యోగుల హక్కులు, బాద్యతలు, పాఠశాల విద్యా పరిరక్షణకై పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తామని, అవసరమైతే సోదర సంఘాలతో కలిసి ఉమ్మడి ఉద్యమాలు చేయడానికి సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, వారిచ్చిన సందేశం నేటి సమాజంలో ఉన్న బలహీనమైన మానవ సంబంధాలు, కార్పొరేట్ విద్యలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు,విద్యా రంగంలో రావలసిన మార్పుల గురించి, నిర్వర్తించ వలసిన బాధ్యతల గురించి ఇచ్చిన సందేశం సమాజానికి దిక్షూచి లాంటిదని వివరించా రు.రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం చరిత్రలో 75  వసంతాల వజ్రోత్సవా లు కర్నూలు నగరం లో విజయవంతం అయిన తీరు చరిత్రలో ఎప్పటికీ నిలిచి పోతుందని వివరించారు. ఈ సమావేశాలు విజయవంతం చేయడానికి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోకారి మరియు జనార్ధన్ అహర్నిశలు శ్రమించారని ప్రత్యేకంగా జిల్లా నాయకత్వాన్ని అభినందిస్తు న్నామని తెలిపారు. సమావేశంలో ఎస్టియు నాయకులు జిల్లా ఆర్థిక కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి, సి. నాగరాజు, వీర చంద్ర యాదవ్, పాలయ్య, వివిధ కమిటీల కన్వీనర్లు పాల్గొన్నారు.

About Author