PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాల్మీకులను ‘ ఎస్టీ’జాబితాలో చేర్చాల్సిందే..

1 min read

ఆ పార్టీలకే వాల్మీకుల మద్దతు

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి వాల్మీకి

పల్లెవెలుగు వెబ్​, ఎమ్మిగనూరు:వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాతామంటూ…దశాబ్దాల పాటు  మోసం చేస్తున్న రాజకీయ పార్టీలకు స్వస్తి పలకాలని, ఎస్టీ జాబితాలో చేర్చే రాజకీయ పార్టీలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి , వాల్మీకి నేత డా. పార్థసారధి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని అజంతా ఫంక్షన్​ హాల్​లో మంగళవారం వాల్మీకి వన భోజన సమితి ఆధ్వర్యంలో రౌండ్​ టేబుల్​ సమావేశం జరిగింది.  ఈ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా వాల్మీకి సోదరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డా. పార్థసారధి మాట్లాడుతూ ఎస్టీ రిజర్వేషన్​ పునరుద్ధరణ కోసం కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నామని, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వాల్మీకుల డిమాండ్​ను పెడచెవిన పెట్టాయని విమర్శించారు. రాష్ట్రంలో ప్రాంతీయ బేదం లేకుండా… వాల్మీకులందరినీ ఎస్టీలో చేర్చాలని డిమాండ్​ చేశారు. వాల్మీకులను ఎస్టీలో చేర్చేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఐక్యత… అత్యవసరం..

వాల్మీకులు రాజకీయంగా…సామాజికంగా.. ఆర్థికంగా ఎదగాలని, ఇందుకు వాల్మీకుల పిల్లలు విద్యారంగంలో రాణించాలని సూచించారు డా. పార్థసారధి. ఐక్యతతోనే ఏదైనా సాధించగలమన్నారు. వాల్మీకులను  ఎస్టీలో చేర్చితే.. వచ్చే హక్కుల గురించి వివరించారు. వాల్మీకి వన భోజన సమితి ఆధ్వర్యంలో రౌండ్​ టేబుల్​ సమావేశం జరగడం అభినందనీయమని, దీన్ని విజయవంతం చేసినందుకు ప్రతి వాల్మీకి సోదరసోదరీమణులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వాల్మీకుల అభ్యన్నతికి కృషి చేసే పార్టీలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, హిందూపురం టీడీపీ పార్లమెంట్​ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ,  తెలంగాణ సివిల్​ సప్లై చైర్మన్​ గట్టు తిమ్మప్ప, పెనుగొండ ఈశ్వరయ్య, పొగాకు రామచంద్ర, టీడీపీ సీనియర్​ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ,  ఉలిగయ్య, మాధవరం రాఘవేంద్ర రెడ్డి, ఢణాపురం తిక్కన్న, వెంకటాపురం బజారి(కౌన్సిలర్​), సర్పంచ్​ కడివెళ్ల రంగస్వామి, సర్పంచ్​ కొటేకల్​ లక్ష్మన్న, బీజేపీ నాయకులు జగ్గాపురం చిన్న ఈరన్న, కౌన్సిలర్​ దయాసాగర్​, మాజీ కౌన్సిలర్​ రామకృష్ణ నాయుడు, ఏఏపీ నియోజకవర్గ ఇన్​చార్జ్​ కాశీం నాయుడు, పత్తికొండ కాంగ్రెస్​ పార్టీ ఇన్​చార్జ్​  క్రాంతి నాయుడు, జక్కుల శ్రీనివాసులు,  వినోద్​ కుమార్​, విజి ఆర్​ కొండయ్య, బిఆర్​కే రామకృష్ణ, జెఎన్​ జగదీష్​(పెనుగొండ) తదితరులు పాల్గొన్నారు.

About Author