PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాల్మీకి బోయల కార్తీక మాస వనభోజనం

1 min read

– గౌరవ అధ్యక్షులు కుబేర స్వామి
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: 20-11-2022వ తేది ఆదివారం నాడు వాల్మీకి బోయ కులస్తుల వనభోజన మహోత్సవ కార్యక్రమము కర్నూలు పట్టణానికి ఆనుకొని ఉన్న వెంకన్న బావి ఆవరణంలో జరుపబడును. ఈ కార్యక్రమం కొంతమంది వాల్మీకి పెద్దల సహకారంతో స్థానిక వాల్మీకి బోయసేవా సంస్థ కార్యాలయం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడును. వాల్మీకులు అందరూ ఆహ్వానితులే, కావున నగరంలోని మరియు పరిసర ప్రాంతాల వాల్మీకులు అందరూ హాజరు కాగలరని తెలియజేయడము అయినది ఈ కార్యక్రమమునకు ఎలాంటి చందాలు స్వీకరించబడవు ఆత్మీయ సమ్మేళనముగా భావించి వాల్మీకి బోయలు అందరూ సకుటుంబ సమేతంగా హాజరు కాగలరు.కులములోని ప్రముఖులు కొందరు హాజరు అవుతారు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును కావున మన వాల్మీకులు బోయలందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని కోరడమైనది
ఇట్లు: వాల్మీకి బోయ సేవా సంస్థ కార్యవర్గము, వాల్మీకి బోయ సేవ సంస్థ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, వాల్మీకి బోయ సేవ సంస్థ ప్రధాన కార్యదర్శి తలారి కృష్ణమనాయుడు, వాల్మీకి బోయ సేవా సంస్థ ఉపాధ్యక్షుడు మహర్షి రమణ.

About Author