PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

8వరోజు…వాల్మీకి బోయల ఆత్మ గౌరవ రిలే నిరాహారదీక్ష

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఆలూరు నియోజకవర్గం స్థానిక బస్టాండ్ దగ్గర వాల్మీకి బోయల ఆత్మ గౌరవ రిలే నిరాహారదీక్ష నిన్నటికి 8వ రోజుకు పూర్తి అయింది. …..కానీ ఇప్పటి వరకు కేంద్రం మరియు రాష్ట్ర రాజకీయ నాయకులు ఎలాంటి స్పందనలేక తమ తమ పార్టీలను బలోపేతంచేసుకోవడానికే పాకులాడుతున్నారు….ఇటు కులంలో వున్న రాజకీయ నాయకులు మరియు పార్టీ నాయకులు ఇప్పటికైన మేలుకొని మనకు ఎస్టీ హోదా కల్పిస్తే సరి లేకపోతే రేపు జరగబోయే పరిణామాలు వేరే విధంగా వుంటాయని అందరికీ హెచ్చరిస్తున్నాము…… మొదలైన ఈ ధీక్ష ఎరుపు రక్తంతో ముగిసేలా చేసుకోవద్దని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసుకుంటున్నాము……ఎస్టీ హోదా ఇస్తారా…..లేక పదవులకు రాజీనామా చేస్తారా…..? ఈ రోజు ధీక్షకు మద్దతు ఇచ్చి సంఘీభావం తెలిపిన,జనరల్ సెక్రటరీ  జక్కుల శ్రీ నివాసులు,వాల్మీకి సీనియర్ నాయకులు వాల్మీకి శేఖర్, భాస్కర్ నాయుడు,నాగరాజు తదితర  గజ్జేహళ్ళి వాల్మీకి సహోదరులు గిరిమల్ల & టీమ్,హెబ్బటం సవారెప్ప, సిద్ధాపురం గ్రామం వాల్మీకి సోదరులు ,మరియు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి వర్యులు మారెప్పతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  APVBS టీమ్ వాల్మీకి యువ నాయకులు సహోదరులందరూ పాల్గొని 8 వ రోజు రిలే నిరాహారదీక్షను విజయవంతం చేయడం జరిగింది.ఈ రోజున ధీక్షలో పాల్గొని 8 వ రోజు రిలే నిరాహారదీక్షను విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. Note :  28.01.2024 ఆదివారం భారీ ర్యాలీతో రోజున రిలే నిరాహారదీక్ష ముగింపు వుంటుంది. కావున వాల్మీకి సహోదలులందరూ వేలాదిమంది పాల్గొని ఆలూరులో జరగబోయే ర్యాలీని విజయవంతం చేయాలనీ పేరు పేరున కోరుకుంటున్నాము.

About Author