PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

1 min read

పల్లెవెలుగు, వెబ్​ ఆత్మకూరు: రాజకీయంగా ఆర్థిక సామాజిక పరంగా అన్ని రంగాలలో అత్యంత వెనుకబడిన వాల్మీకి బోయ కులస్తులను బీసీ ల జాబితా నుండి ఎస్టీ ల జాబితా లోకి చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక వాల్మీకి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఎలాంటి కులవృత్తి లేని వాల్మీకి బొయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఈ సమస్య న్యాయ పరమైనదని డిమాండ్ చేస్తూ బుదవారం నంద్యాల జిల్లా ఆత్మకూరు తహశీల్దార్(MRO) కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తొలుత వాల్మికుల ఐక్యత వర్ధిల్లాలి , వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో వెంటనే చేర్చాలని కార్యకర్తలు ,నాయకులు నినాదాలు చేశారు. అనంతరం తహశీల్దార్ కు వాల్మీకి నాయకులు పోస్టల్ రాముడు, దీప కాలేజీ రమణ ,స్టూడియో వెంకట్రాముడు , టీచర్ జనార్ధన్ ,పాలశివ, టైలర్ వేకటేశ్వర్లు , రిపోర్టర్ నాగరాజుల నాయకత్వంలో వినతీ పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వాల్మీకుల చిరకాల స్వప్న మైన ST సాధన కోసం విజ యవాడలో పెనుగొండ ఈశ్వరయ్య ఈ నెల రెండు నుంచి సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే వాల్మికులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని టిడిపి , వైసీపీ నాయకులు ఓట్లు దండుకుని గద్దె నెక్కాక హామీలను విస్మరించడం పరిపాటిగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో ఒకచోట STలుగా ,మరోచోట BC లుగా పరగనించేల రెండు నిభందనలు వర్తింప చేయడం దారుణ మన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో బోయలు ఎస్టీ లుగా , ఎస్సీ లుగా కొనసాగితే ఏపీ లో మాత్రం అందుకు భిన్నంగా ఉండడం శోచనీయం అన్నారు.వాల్మీకి బోయలు ఎదగ కుండా పాలకులు అణిచి వేస్తున్నారని ఇది తగదన్నారు. వాల్మీకి కార్పొరేషన్ కు నిధులు విడుదల చేయక పోవడం విడ్డూరం గా ఉందన్నారు . ఈకార్యక్ర మంలో వాల్మీకి సంఘం నాయకులు డ్రైవర్ మల్లి,నారాయణ, శివ , నాగరాజు ,రంగస్వామి , విశ్వనాథ్ తది తరులు పాల్గొన్నారు.

About Author