ఉత్తమ ఉపాధ్యాయిని వినుత ను సన్మానించిన వాల్మీకి సంఘం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్న వినుత మేడం ను పత్తికొండ వాల్మీకి సంఘం నాయకులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. పత్తికొండ మండల పరిధిలోని హోసూరు గ్రామంలో ఎంపీయుపి స్కూల్లో విధులు నిర్వహిస్తున్న వినుత మేడం ఉత్తమ సేవలందించినందుకు గాను ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు స్వీకరించింది. ఈ మేరకు పత్తికొండ వాల్మీకి సంఘం యూత్ అధ్యక్షుడు ముని నాయుడు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ద్వారా వినుతా మేడం ను వాల్మీకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకుడు తిరుపాల్ నాయుడు మాట్లాడుతూ, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు వినుతు మేడం ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. వినుత మేడం ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చింని అని, తమ వృత్తి పట్ల అంకితభావంతో పనిచేస్తూ ఉపాధ్యాయులకు ఆదర్శంగా పనిచేయడం అభినందనీ యమని కొనియాడారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మేడంని ఆదర్శంగా తీసుకొని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు చక్రాల ఎంపీటీసీ బోయరాజు, హోసూరు సంజప్ప, కడవల సుధాకర్, బ్యూటీ పవన్ కుమార్, బోయ కేశవ్, కోయిలకొండ రాజు తదితరులు పాల్గొన్నారు.