ఆలూరులో వాల్మీకి వన భోజన కార్యక్రమం విజయవంతం…
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో ఆలూరు బెళ్ళిగుండు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు నిర్వహించిన వాల్మీకి వన భోజన కార్యక్రమం వాల్మీకి సహోదరులందరూ కలిసి వచ్చి విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాల్మీకి సహోదరులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో వాల్మీకులను ST లో చేర్పించే వరకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటం చేస్తామని స్థానిక MLA బి.విరుపాక్షి , APVBS రాష్ట్ర నాయకులు బోయ క్రాంతి నాయుడు,కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లార్తి అర్జున్, ఆలూరు తాలూకా అధ్యక్షుడు డి.నాగేష్, యూత్ వింగ్ అధ్యక్షుడు హుళేబీడు వీరేష్, హాలహర్వి మండల గౌరవాధ్యక్షులు నరసప్ప, రాష్ట్ర నాయకులు కప్పట్రాళ్ళ మల్లికార్జున,గూళ్యం అంబన్న,విలేకరి రాజేష్, హుళేబీడు కేశవ,సూరి,వరుణ్,అరికేర తిక్కస్వామి,సీనియర్ నాయకులు అర్ధగేరి శీనప్ప,కురువళ్ళిఈరన్న,శిరిగాపురం మల్లికార్జున,తదితర ఎమ్మిగనూరు, ఆదోని, అనంతపురం,నంద్యాల జిల్లాల నుంచి వాల్మీకీ సహోదరులు తదితర వాల్మీకి యువనాయకులు తెలిపారు. కార్తీక వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన వాల్మీకి సహోదరులందరికి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.