వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కోరుతూ సెంట్రల్ మినిస్టర్ ప్రహల్లాద జోషిని మరియు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ని కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకులు దాదాపుగా 40 లక్షల జనాభా కలిగి ఉన్నారు. వీరు ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగ పరంగా అన్ని రకాలుగా వెనకబడి ఉన్నారు దానికి కారణం ఎస్టీ రిజర్వేషన్ లేకపోవడం ఎస్టి రిజర్వేషన్ కోసం వాల్మీకి సంఘాలు నాయకులు అనేకమంది పోరాటాలు చేసిన ఫలితంగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వాల్మీకులను ఎస్టీలుగాగుర్తించాలని క్యాబినెట్ లోను అసెంబ్లీ లోను తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదేవిధంగా గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2017లో వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది ప్రస్తుతం ఎస్టీ రిజర్వేషన్ బిల్లు కేంద్రం చేతిలో ఉంది అందుకోసం నేడు ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ ప్రహల్లాద జోషిని మరియు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ని కలిసి విన్నవించడం జరిగింది. అందుకు వారు సానుకూలంగా స్పందించి ఈ అంశం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిరుగుప్ప మాజీ ఎమ్మెల్యే సోము లింగప్ప వీఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామ్ భీం నాయుడు వాల్మీకి సీనియర్ నాయకులు పంపాపతి ఢిల్లీ వి ఆర్ పి ఎస్ నాయకులు రవీందర్ సుధీర్ పాల్గొనడం జరిగింది.