PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వంశీ క్షమాప‌ణ చెప్పడం.. ఆహ్వానించ‌ద‌గిన‌ది !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : ఇటీవ‌ల ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబం పై అనుచిత వ్యాఖ్యల నేప‌థ్యంలో వైసీపీ నేత‌ల పై ప‌లువ‌ర్గాల నుంచి విమ‌ర్శలు ఎదురయ్యాయి. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీ .. చంద్రబాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వరికి క్షమాప‌ణ చెప్పారు. దీనిపై సీపీఐ నేత నారాయ‌ణ స్పందించారు. అసెంబ్లీ ఘటనపై వంశీ క్షమాపణలు చెప్పడం స్వాగతించదగ్గ విషయమన్నారు. ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారం తీరు అన్యాయం, దురదృష్టకరమన్నారు. కుటుంబ పెద్దగా వ్యవహరించి కంట్రోల్ చేసి ఉండాల్సిందన్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దుఖించకుండా హుందాగా వ్యవహరించాల్సిందని నారాయణ చెప్పుకొచ్చారు.

About Author