PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్తీక మాసంలో వనభోజనం సంపూర్ణ ఆరోగ్యానికి  ప్రతీక

1 min read

పద్మభూషణ అవార్డు గ్రహీత డాక్టర్  ఎల్లా కృష్ణ.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా కమ్మవారి కార్తీక వనభోజనం మహోత్సవానికి  భారత్ బయోటిక్ వ్యవస్థాపకులు పద్మభూషణ అవార్డు గ్రహీత  డాక్టర్ ఎల్లా కృష్ణ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ  భారతదేశమంతటా కోవిడ్ మహామారి వ్యాపించి భారతీయులను అతులాకుతలం చేస్తున్న సమయంలో భారత్ బయోటిక్ సంస్థ  ద్వారా కోవిడ్ 19 వ్యాక్సిన్ కో వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసి దేశ విదేశాలకు అందజేయడం జరిగిందన్నారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ప్రముఖుల అందరి చేతుల మీదుగా మరియు కమ్మ సంఘం కార్యవర్గ సభ్యుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. కర్నూలు జిల్లా కమ్మ సంఘం అధ్యక్షులు కమ్మ కృష్ణమోహన్ ,ప్రధాన కార్యదర్శి పెనికలపాటి రాజశేఖర్, మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత యార్లగడ్డ హరిచంద్ర ప్రసాద్, మాంటిసోరి స్కూలు అధినేత కే. ఎన్ .వి రాజశేఖర్, జంపాల మధుసూదన్ రావు, దుగ్గపూటి నాగిరెడ్డి, కూసుపాటి బాబ్జి, కూసుపాటి జంపాల  అమిత్, దుగ్గపూటి చంద్రశేఖర్, గుమ్మల శేఖర్, జంపాల గోపి ,అన్నం భాస్కర్, సోంపల్లి శేఖర్ ,ఉన్నం వెంకటేశ్వర్లు, రాయపాటి శ్రీనివాస్ ,దుగ్గపూటి పెద్దిరెడ్డి, దుగ్గపూటి శశి రెడ్డి ,సురేష్ చౌదరి ,సుమన్ చౌదరి, పెనికిలపాటి నాగేశ్వరరావు, పెనికలపాటి హనుమంతరావు చౌదరి తదితరులు పాల్గొన్నారు. వివిధ రకాల ఆటపాటలను నిర్వహించి బహుమతులను ప్రధానం చేశారు.  మ్యాజిక్ షో తదితర  కార్యక్రమాలను నిర్వహించారు.

About Author