ఎస్‌ఐను చితకబాదిన ఓ మహిళ భర్త.. కారణం ఇదే!
1 min read
పల్లెవెలుగు వెబ్: నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులే పాడు పనులు చేస్తూ డిపార్ట్‌మెంట్‌కు మాయని మచ్చ తెస్తున్నారు. తాజాగా ఓ ఎస్‌ఐ వివాహితతో నడుపుతున్న అక్రమ సంబంధం బయటపడింది. వివరాలు ఇలా.. వనపర్తి రూరల్ ఎస్‌ఐ షేక్ షఫీ.. కొత్తపేటకు చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం కాస్తా.. ఆనోటా.. ఈ నోటా పాకి చివరికి సదరు మహిళ భర్తకు తెలిసింది. దీంతో ఆయన వారిద్దరిని ఎట్లాగైనా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ప్లాన్ వేశాడు. ఇందుకు అతని స్నేహితుల సహకారం కూడా తీసుకున్నాడు. పక్కా ప్రణాళికతో ఎస్‌ఐ షఫీ, ఆమె.. ఇద్దరు ఒకే గదిలో ఉండగా.. రెడ్ హ్యాండ్‌డ్‌గా పట్టుకుని.. ఇద్దరిని చితకబాదాడు. చివరికి ఎస్‌ఐ షఫీ గాయాలను తట్టుకోలేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం కాస్తా.. పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సదరు ఎస్ఐను విధుల నుంచి సస్పెండ్ చేశారు.