వంగవీటి రాధాను పథకం ప్రకారమే సభకు తీసుకెళ్లారు !
1 min read
పల్లెవెలుగువెబ్ : టీడీపీ నేత వంగవీటి రాధాను పథకం ప్రకారమే వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ సభకు తీసుకెళ్లారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా కలిశారు. రెక్కీ ఘటన వివరాలను రాధాను నేతలు అడిగి తెలుసుకున్నారు. రాధాను పావుగా వాడుతూ వైసీపీ మైండ్‌గేమ్ ఆడుతోందని మండిపడ్డారు. రెక్కీ జరగలేదని నగర సీపీ చెప్పడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.