శ్రీశైలంలో వరలక్ష్మి వ్రతం ..
1 min readపల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రీశైలంలో నాలుగవశుక్రవారం పురస్కరించుకుని దేవస్థానం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించింది. ఆలయ ఉత్తర ద్వారం ఎదురుగా ఉన్న చంద్రావతి కల్యాణ మండపంలో ఈ వ్రతాన్ని ఏర్పాటు చేశారు వివిధ ప్రాంతాల నుండి350 పైగా గిరిజన ముత్తైదు మహిళలు వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేకంగా ఐటీడీఏ అధికారులు మరియు దేవస్థానం ఆలయ అధికారులుఆహ్వానించారు. వారితో పాటు 250 మహిళలు పూజలోపాల్గొన్నారు. భక్తులందరిచేత విడివిడిగా కలశస్థాపన చేయించి వరలక్ష్మీదేవి పూజను ప్రారంభించారు. పూజా ద్రవ్యాలను దేవస్థానం సమకూర్చింది. ముందుగా మహాగణపతికి పూజలు నిర్వహించి తరువాత వేదికపై ఆశీనులను జేసిన స్వామిఅమ్మవార్లలకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపించారు. శ్రీసూక్తవిధానంలో వ్రతసంకల్పపూర్వకం గా వరలక్ష్మీదేవికి షోడశోపచారపూజలు నిర్వహిం చారు. ఆలయ అర్చకులు వ్రతకథను పఠించి వ్రతమహిమ విశేషాలను భక్తులకు తెలియజేశారు. అనంతరం నీరాజన మంత్రపుష్పాలను జరిపి వ్రతసమాప్తి చేశారు. మహిళలందరికీ అమ్మవారి శేషవస్త్రాలుగా రవికగుడ్డ, పూలు, గాజులు, కైలాస కంకణాలు, ప్రసాదం అందజేశారు. మహిళలందరికీ ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించి, అన్నపూర్ణ భవనంలో అన్నప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఐటీడీఏ పీవో రవీంద్రారెడ్డి దంపతులు, పాల్గొన్నారు. ధార్మిక కార్యక్రమాలలో భాగంగా వరలక్ష్మీ వ్రతాన్ని దేవస్థానంనిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేద పండితులు మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు.