వరలక్ష్మీ వ్రతం ప్రత్యేక పూజలు
1 min read
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చెన్నూరు లో వెలసిన శ్రీ శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఆలయ నిర్వహకులు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు, శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా వచ్చిన వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు భావించారు, తెల్లవారుజామున సుప్రభాత సేవ, గణపతి పూజ, మంగళ స్నానం, అభిషేకాలు గావించారు, ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మాట్లాడుతూ శ్రావణమాసం రెండవ శుక్రవారం అష్టలక్ష్ములలో వరలక్ష్మి దేవికి ప్రత్యేకత ఉందని తెలిపారు మిగిలిన లక్ష్మీ పూజల కన్నా వరలక్ష్మి పూజ శ్రేష్టమని శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు ఉండడమే కాకుండా సర్వ మంగళ సంప్రాప్తి కోసం, సకలబిష్టాల కోసం నిత్య సుమంగళి గా వర్ధిల్లాలని స్త్రీలు ఈ వ్రతాన్ని పాటిస్తారని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు అల్లి శ్రీరామమూర్తి, సాదు కిషోర్, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.