పత్తి రైతులకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రిలయన్స్ ఫౌండేషన్ మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో కోతిరాళ్ల, పందికోన తదితర గ్రామ రైతు సోదరులకు మంగళవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా పత్తి పంటకు సాగుకు సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు డాక్టర్ శివరామకృష్ణ గారు పత్తి రైతులకు టెలి కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా పత్తి పంట గురించి రైతు సోదరులకు పలు సూచనలు తెలియజేశారు. పత్తి పంట ఎర్రగా కావడానికి భూమి అధిక ఉష్ణోగ్రతలు , వర్షాలు ఆలస్యం కారణంగా భూమి పోషక విలువలను కోల్పోయి ఫైరు ఎర్రగా మారుతుంది అని తెలియజేశారు. అందుకు గాను పత్తి పంటను కాపాడుకోవడానికి 19-19-19 మందును, 14-0-35 మందు 5 గ్రాములను లీటరు నీటికి కలుపుకొని బాగా తడిచేలా పిచికారి చేసుకోవాలని సూచించారు.ఐదు రోజుల తర్వాత ఫార్ములేసన్ 4 లేదా 6ను 5 గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవాలి అని అన్నారు.అలాగే పత్తి పంటలో వడ తెగులు నివారణ నియంత్రణకు కాపర్ ఆక్షి క్లోరైడ్ 3 గ్రాములను ఒక లీటర్ నీటికి లేదా తయోఫినైట్ మీతెల్ ను ఒక గ్రాము లీటర్ నీటిలో కలుపుకొని మొక్కల మొదల వద్ద వేసుకుంటే కొంతవరకు ఎర్రగా పోవడం అనేది తగ్గుతుందని రైతు సోదరులకు తెలియజేశారు.ఈకార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ ఎం ప్రకాష్ గారు మరియు జిల్లా ప్రతినిధి ఎం నారాయణ, కోతిరాళ్ల, పందికోన గ్రామ రైతు సోదరులు పాల్గొన్నారు.