ఘనంగా వాసవి మాత ఆత్మార్పణ దినం
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండల కేంద్రంలోని అమ్మవారి శాలలో సోమవారం నాడు వాసవి మాత ఆత్మార్పణ దినం ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం నుంచి ఆర్యవైశ్య సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి అమ్మవారి శాలకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు సత్యనారాయణ శర్మ వసంతలక్ష్మి లు ఉదయం సుప్రభాతం,క్షీరాభిషేకం,ఫల పంచామృతాభిషేకం చేసిన అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వాసవి మాత అష్టోత్తర శతనామావళి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు.వాసవిమాత ఆత్మార్పణ మహోత్సవ యాగం(యజ్ఞం) నిర్వహించారు. అనంతరం మహా మంగళహారతి,తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సోదర సోదరీమణులు పాల్గొన్నారు: ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మధు సుధన్ గుప్తా,ఉపాధ్యక్షులు సతీష్ కుమార్, మల్లిఖార్జున,కార్యదర్శి రమణయ్య, కోశాధికారి వెంకటేశ్వర్లు,ఉప కార్యదర్శి సురేష్ కుమార్,సలహాదారులు బుజ్జయ్య,పద్మనాభయ్య, శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు,ఆర్యవైశ్య సోదర సోదరీమణులు పాల్గొన్నారు.