రక్తనాళాల శస్త్రచికిత్స… 100 మంది వ్యాధిగ్రస్తుల తరలింపు
1 min read– స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పస్పిల్ మున్నా
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: రక్తనాళాల శస్త్ర చికిత్స కోసం ఆత్మకూరు నుండి హైద్రాబాద్ ఏషియన్ వాస్కులర్ ప్రముఖ వైద్యశాలకు 100 మంది రోగులను పంపినట్లు ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పస్పిల్ మున్నా తెలిపారు.ముఖ్యఅతిథిగా ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ గౌరవాధ్యక్షులు రేడియం నూర్ మరియు ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ కోశాధికారి నాగుర్ ఖాన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా మున్నా మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం స్పోర్ట్స్ క్లబ్ ఆవరణంలో 1000 మందికి ఉచిత రక్త నాళాల పరీక్షలు నిర్వహించారని అందులో వంద మందిని శస్త్ర చికిత్స అవసరమైన వారీగా గుర్తించారు.గురువారం రోగుల అంగీకారం హైద్రాబాద్ కు పంపినట్లు తెలిపారు.మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సొంత నిధులతో రెండు బస్సులను ఏర్పాటు చేశారని తెలిపారు.పేద ప్రజలకు సహాయ సహకారాలతో అందించడం లొ బుడ్డా రాజశేఖర్ రెడ్డి ముందుంటారు అని అన్నారు.పేదల కష్టం తెలిసిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి కి,హైద్రాబాద్ ఏషియన్ వాస్కులర్ వైద్యశాల అధినేత ప్రవీణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ,అబ్దుల్ కలాం, అబ్దుల్ హుస్సేన్,సురేంద్ర బాబు, హాస్పిటల్ ఇంఛార్జి నవీన్ పాల్గొన్నారు.